Nara Lokesh: రేపటి నుంచి మళ్లీ నారా లోకేశ్ యువగళం

Nara Lokesh Yuvagalam will restart tomorrow
  • తుపాను కారణంగా లోకేశ్ పాదయాత్రకు తాత్కాలిక విరామం
  • రేపు పిఠాపురం నియోజకవర్గం నుంచి పాదయాత్ర కొనసాగింపు
  • ఇప్పటివరకు 216 రోజుల్లో 2,974 కిలోమీటర్ల నడక
  • ఈ ఏడాది జనవరి 27న మొదలైన యువగళం

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర మిగ్జామ్ తుపాను కారణంగా తాత్కాలికంగా నిలిచిపోయిన సంగతి తెలిసిందే. తుపాను ప్రభావం ముగియడంతో లోకేశ్ పాదయాత్ర మళ్లీ మొదలు కానుంది. రేపు (డిసెంబరు 9) పిఠాపురం నియోజకవర్గంలోని శీలంవారి పాకలు జంక్షన్ నుంచి యువగళం కొనసాగించనున్నారు. లోకేశ్ ఈ ఏడాది జనవరి 27న చిత్తూరు జిల్లా కుప్పంలో పాదయాత్ర ప్రారంభించారు. 400 రోజుల్లో 4 వేల కిలోమీటర్లు నడవాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఇప్పటివరకు మొత్తం 216 రోజుల్లో 2,974 కిలోమీటర్ల దూరం నడిచారు.

217వ రోజు (9-12-2023) యువగళం వివరాలు

పిఠాపురం/తుని అసెంబ్లీ నియోజకవర్గాలు

ఉదయం
8.00 – శీలంవారిపాకలు జంక్షన్ నుంచి పాదయాత్ర ప్రారంభం.
9.30 – కోనపాపపేటలో మత్స్యకారులతో సమావేశం.
11.00 – శ్రీరాంపురంలో ఎస్సీలతో సమావేశం.
11.05 – పాదయాత్ర తుని అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశం.
మధ్యాహ్నం
12.05 – జిఎంఆర్ హాస్పటల్ వద్ద భోజన విరామం.
3.00 – కాకినాడ సెజ్ బాధిత రైతులతో ముఖాముఖి సమావేశం.
సాయంత్రం
4.00 – జిఎంఆర్ హాస్పటల్ వద్ద నుంచి పాదయాత్ర ప్రారంభం.
4.30 – బుచ్చయ్యపేట సెంటర్ లో గ్రామస్తులతో సమావేశం.
6.00 – వాకదారిపేట సెంటర్ లో మాటామంతీ.
6.45 – పెరుమాళ్లపురం దివీస్ ఫ్యాక్టరీ వద్ద స్థానికులతో సమావేశం.
రాత్రి
7.00 – ఒంటిమామిడి కొత్తపాకల వద్ద ఆక్వా రైతులతో సమావేశం.
7.45 – ఒంటిమామిడి వద్ద విడిది కేంద్రంలో బస.

  • Loading...

More Telugu News