NTR: నెట్ ఫ్లిక్స్ సీఈవోకు తన ఇంట విందు ఇచ్చిన ఎన్టీఆర్

NTR hosts lunch for Netflix CEO Ted Sarandos in his residence
  • హైదరాబాదులో పర్యటిస్తున్న నెట్ ఫ్లిక్స్ సీఈవో టెడ్ సరాండోస్
  • నిన్న రామ్ చరణ్ నివాసంలో సందడి చేసిన సరాండోస్
  • నేడు జూనియర్ ఎన్టీఆర్ ఇంటికి రాక
  • ఎన్టీఆర్ తో పలు అంశాలపై చర్చలు
  • సమావేశంలో పాల్గొన్న కల్యాణ్ రామ్, కొరటాల శివ
ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సీఈవో టెడ్ సరాండోస్ హైదరాబాదులో పర్యటిస్తున్నారు. వరుసగా టాలీవుడ్ ప్రముఖులతో భేటీ అవుతున్నారు. పర్యటన తొలిరోజున గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నివాసంలో సందడి చేసిన సరాండోస్ నేడు జూనియర్ ఎన్టీఆర్ ఇంటికి విచ్చేశారు. 

నెట్ ఫ్లిక్స్ బృందానికి సాదర స్వాగతం పలికిన ఎన్టీఆర్... వారికి తన ఇంట విందు ఇచ్చారు. టెడ్ సరాండోస్ ఈ సందర్భంగా జూనియర్ తో పలు అంశాలపై ముచ్చటించారు. నెట్ ఫ్లిక్స్ పై అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.

అంతేకాదు, ఎన్టీఆర్ లాగానే సరాండోస్ కూడా భోజనప్రియుడే! దాంతో ఇద్దరి మధ్య సినిమాలు, తదితర అంశాలతో పాటు ఆహార విషయం కూడా ప్రముఖంగా చర్చకు వచ్చింది. కాగా, ఈ సమావేశంలో ఎన్టీఆర్ సోదరుడు కల్యాణ్ రామ్, ప్రముఖ దర్శకుడు కొరటాల శివ కూడా పాల్గొన్నారు.
NTR
Ted Sarandos
Netflix
Hyderabad
Tollywood

More Telugu News