KCR: యశోదలో మాజీ సీఎం కేసీఆర్‌కు కొనసాగుతున్న రీప్లేస్‌మెంట్ సర్జరీ

Treatment to former cm kcr
  • అర్ధరాత్రి కాలు జారడంతో కేసీఆర్ కాలికి గాయం
  • తుంటి ఎముక విరిగినట్లు గుర్తించిన వైద్యులు
  • సాయంత్రం ఆపరేషన్ చేస్తున్న వైద్య బృందం
బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో డాక్టర్లు హిప్ రీప్లేస్‌మెంట్ ఆపరేషన్‌ను చేస్తున్నారు. కేసీఆర్ గురువారం అర్ధ‌రాత్రి బాత్ కాలు జారి.. కిందపడటంతో కాలికి గాయమైంది. ఆయనను సోమాజిగూడ యశోదా హాస్పిటల్‌కు తరలించారు. పరిశీలించిన వైద్యులు కేసీఆర్ తుంటి ఎముక విరిగినట్లు గుర్తించారు. శుక్రవారం సాయంత్రం వైద్యులు...కేసీఆర్‌కు హిప్‌ రీప్లేస్‌మెంట్‌ సర్జరీ చేస్తున్నారు. కాగా, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ పలువురు సందేశాలు పంపిస్తున్నారు.
KCR
yashoda hospital
BRS

More Telugu News