తృణమూల్ ఎంపీ మహువా మొయిత్రాపై పార్లమెంటు నుంచి బహిష్కరణ వేటు
- పార్లమెంటులో ప్రశ్నలు అడగడానికి డబ్బులు తీసుకున్నట్టు మొయిత్రాపై ఆరోపణ
- నివేదిక సమర్పించిన పార్లమెంటు ఎథిక్స్ కమిటీ
- మూజువాణి ఓటుతో ఆమోదించిన లోక్ సభ
- వాకౌట్ చేసిన విపక్ష సభ్యులు
కాగా, మహువా మొయిత్రా తీరు అనైతికం అని కమిటీ తన నివేదికలో పేర్కొంది. మొయిత్రా లోక్ సభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని సిఫారసు చేసింది. ఎథిక్స్ కమిటీ నివేదికను లోక్ సభ మూజువాణి ఓటు ప్రాతిపదికన ఆమోదించింది.
అయితే విపక్ష సభ్యులు ఈ నివేదికను నిరసించారు. కొత్త పార్లమెంటు భవనంలో ఇవాళ బ్లాక్ డే, ఓ నల్ల అధ్యాయం నేడు మొదలైంది అంటూ కాంగ్రెస్ లోక్ సభాపక్ష నేత అధిర్ రంజన్ చౌదరి విమర్శించారు. మొయిత్రాను బహిష్కరిస్తున్నట్టు ప్రకటించగానే, విపక్ష సభ్యులు లోక్ సభ నుంచి వాకౌట్ చేశారు.