Pawan Kalyan: కేసీఆర్ కోలుకొని ప్రజలకు సేవ చేయాలి: పవన్ కల్యాణ్

Pawan Kalyan on KCR injured
  • కేసీఆర్ జారిపడి గాయమైందని తెలిసి బాధపడ్డానన్న పవన్ కల్యాణ్
  • కేసీఆర్ త్వరగా... సంపూర్ణంగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానన్న జనసేన అధినేత
  • అనారోగ్య పరిస్థితులను మనోధైర్యంతో కేసీఆర్ అధిగమించాలని ఆకాంక్ష
మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జారిపడి గాయమైందని తెలిసి బాధపడ్డానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. కేసీఆర్ త్వరగా... సంపూర్ణంగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు. అనారోగ్య పరిస్థితులను మనోధైర్యంతో కేసీఆర్ అధిగమించాలన్నారు. కేసీఆర్ కోలుకొని ప్రజలకు సేవ చేస్తారని ఆకాంక్షించారు. కాగా, మాజీ సీఎం కేసీఆర్ అర్ధరాత్రి కాలుజారి కిందపడిన విషయం తెలిసిందే. వెంటనే ఆయనను యశోద ఆసుపత్రిలో చేర్చారు. కేసీఆర్ ఎడమ కాలు తుంటి ఎముక మార్పిడి చేయాలని డాక్టర్లు తెలిపారు. ఆయన కోలుకోవడానికి ఆరు నుంచి ఎనిమిది వారాలు పడుతుందన్నారు. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు.
Pawan Kalyan
Janasena
KCR
BRS

More Telugu News