KCR: రేవంత్‌రెడ్డి ఆదేశాలతో.. ఆసుపత్రికి వెళ్లి కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించిన ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ

Revanth Reddy Orders To Monitor KCR Health
  • ఫాంహౌస్ బాత్రూంలో జారిపడిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్
  • హైదరాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ సీఎం
  • కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని సీఎం రేవంత్‌కు వివరించిన వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి
ఎర్రవల్లిలోని ఫాంహౌస్‌ బాత్రూంలో జారిపడి హైదరాబాద్ యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ సీఎం కేసీఆర్‌ పరిస్థితిపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పందించారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని వైద్య ఆరోగ్యఖశాఖ కార్యదర్శి రిజ్వీని ఆదేశించారు. 

సీఎం ఆదేశాలతో యశోద ఆసుపత్రికి చేరుకున్న రిజ్వీ.. కేసీఆర్‌ను పరామర్శించారు. వైద్యులను అడిగి ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. అనంతరం విషయాన్ని సీఎం రేవంత్‌కు వివరించారు. కేసీఆర్ తుంటి ఎముక విరగడంతో ఆపరేషన్ చేయాలని వైద్యులు నిర్ణయించారు.
KCR
Revanth Reddy
Congress
Yashoda Hospital

More Telugu News