Varanasi: వారణాసిలో తెలుగు కుటుంబం ఆత్మహత్య!

Four of family from Andhra Pradesh found hanging in Varanasi
  • తమ ఇద్దరు పిల్లలతో కలిసి ఓ సత్రంలో ఉంటున్న భార్యాభర్తలు
  • గురువారం తమ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య
  • ఆర్థిక ఇబ్బందులతో బలవన్మరణానికి పాల్పడ్డామంటూ సూసైడ్ నోట్
  • మృతులను తూర్పు గోదావరి జిల్లా వాసులుగా గుర్తించిన పోలీసులు

వారణాసి పుణ్యక్షేత్రంలో ఓ తెలుగు కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, తూర్పు గోదావరి జిల్లా మండపేటకు చెందిన కొండబాబు (50) తన భార్య లావణ్య (45) పిల్లలు రాజేశ్ (25), జైరాజ్‌లతో (23) కలిసి కైలాశ్ భవన్‌లో ఆశ్రయం పొందుతున్నారు. డిసెంబర్ 3న వారు ఆ సత్రంలో చేరారు. అయితే, గురువారం కుటుంబం అంతా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు తెలిపారు. 

ఘటనా స్థలంలో ఓ సూసైడ్ నోట్ కూడా లభించిందని వారణాసి కమిషనర్ ఆఫ్ పోలీస్ అశోక్ ముథా జైన్ తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు తాళలేకే తాము బలవన్మరణానికి పాల్పడినట్టు వారు చిట్టీలో రాశారని పేర్కొన్నారు. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్టు చెప్పారు. ఘటనపై దర్యాప్తు జరుగుతోందని తెలిపారు.

  • Loading...

More Telugu News