Bandi Sanjay: తన పదవీకాలంలో రేవంత్ రెడ్డి విజయవంతం కావాలని కోరుకుంటున్నా: బండి సంజయ్

Bandi Sanjay wishes Revanth Reddy for successful tenure
  • తెలంగాణలో ముగిసిన అసెంబ్లీ ఎన్నికలు
  • నేడు సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన రేవంత్ రెడ్డి 
  • అభినందనలు తెలిపిన బండి సంజయ్
ఇటీవల ముగిసిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో బీజేపీ ఎంపీ బండి సంజయ్ ఎమ్మెల్యేగా పోటీ చేసి బీఆర్ఎస్ నేత గంగుల కమలాకర్ చేతిలో ఓటమిపాలయ్యారు. కరీంనగర్ బరిలో తాను ఎమ్మెల్యేగా ఓడిపోయినప్పటికీ, రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ గద్దె దిగడం పట్ల ఆయన సంతోషంగా ఉన్నారు. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేసిన నేపథ్యంలో బండి సంజయ్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. 

"తెలంగాణ ముఖ్యమంత్రిగా పదవీప్రమాణం చేసిన రేవంత్ రెడ్డి గారికి అభినందనలు. ఆయన మంత్రివర్గ సహచరులకు కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నా. వారు తమ పదవీకాలంలో విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నా" అంటూ బండి సంజయ్ ట్వీట్ చేశారు.
Bandi Sanjay
Revanth Reddy
Chief Minister
Congress
BJP
BRS

More Telugu News