Shashi Tharoor: కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్‌లా ఇంగ్లిష్ మాట్లాడాలంటే ఈ వీడియో చూడండి!

Shashi Tharoors English becomes subject of Australian teachers class video goes viral
  • ఇంగ్లిష్ భాషా నైపుణ్యం కారణంగా శశిథరూర్‌కు మంచి పాప్యులారిటీ
  • ఈ టాలెంట్ వెనకున్న సీక్రెట్ చెప్పిన ఆస్ట్రేలియా ఇంగ్లిష్ టీచర్
  • శశి ఫార్ములాను అనుసరిస్తు ఇంగ్లిష్‌పై పట్టుపెంచుకోవచ్చని సూచన
కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ పేరు చెబితే ముందుగా గుర్తొచ్చేది ఆయన ఆంగ్ల భాషా నైపుణ్యమే. ఒక్కో పదాన్ని ప్రేమతో ఉచ్చరిస్తున్నట్టు ఉండే ఆయన శైలి అనేక మందిని కట్టిపడేస్తుంది. ఆయనలాగా ఇంగ్లిష్‌పై పట్టుసాధించాలని, పలకాలని కోరుకోని వారు ఉండరంటే అతిశయోక్తి కాదేమో. అయితే, ఆంగ్లభాషపై శశిథరూర్‌కున్న పట్టు ఓ ఆస్ట్రేలియా టీచర్‌ను కూడా ఆకర్షించింది. ఇంగ్లిష్‌లో థరూర్ ఎలా మాట్లాడాలో చెబుతూ టీచర్ జే చేసిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. 

శశిథరూర్ పదాలను పలికే తీరులోనే అందమంతా దాగుందని జే వివరించాడు. ప్రతి పదంలోని సిలబెల్స్‌ను తనదైన శైలిలో ప్రత్యేకంగా ఉచ్చరిస్తూ పలకడం వల్లే శశి మాటలు వినసొంపుగా ఉంటాయని చెప్పారు. పదంలోని అన్ని సిలబెల్స్‌ను థరూర్ ఒకే రీతిలో పలకరని, సందర్భానుసారం వాటిలో కొన్నింటిని ఒత్తి పలుకుతూ వినసొంపుగా చెబుతారని ఉదాహరణతో పాటు జే చెప్పుకొచ్చారు. శశి భాషానైపుణ్యం వెనక దాగున్న సీక్రెట్స్‌ను అరటిపండు వలిచినట్టు వివరించిన ఈ వీడియో నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటోంది. 
Shashi Tharoor
Viral Videos

More Telugu News