Ghaziabad: పెళ్లిలో ఎంగిలి ప్లేట్లు అతిథులకు తాకాయని.. వెయిటర్‌ను కొట్టి చంపేశారు!

Waiter beaten to death after dirty plate touches wedding guests
  • ఉత్తరప్రదేశ్‌‌లోని ఘజియాబాద్‌లో ఘటన
  • ఆలస్యంగా వెలుగులోకి
  • ముగ్గురు నిందితుల అరెస్ట్

ఓ పెళ్లిలో ఎంగిలి ప్లేట్లను శుభ్రం చేసేందుకు తీసుకెళ్తుండగా అవికాస్తా అతిథులకు తాకడంతో తీసుకెళ్తున్న వెయిటర్‌ పంకజ్ ను కొట్టి చంపేశారు. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో గత నెల 17న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అంకుర్ విహార్ సీజీఎస్ వాటికలో పంకజ్ వెయిటర్‌గా పనిచేస్తున్నాడు. పెళ్లిలో తిన్న ఎంగిలి ప్లేట్లను శుభ్రం చేసేందుకు పంకజ్ తీసుకెళ్తుండగా అవి కాస్తా రిషభ్, అతడి ఇద్దరు స్నేహితులకు తాకాయి. 

ఆగ్రహంతో ఊగిపోయిన రిషభ్ అతడి స్నేహితులు మనోజ్, అమిత్ కలిసి పంకజ్‌ను అక్కడే చితకబాదారు. తీవ్రంగా గాయపడిన పంకజ్ అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో భయపడిన రిషభ్, అతడి స్నేహితులు పంకజ్ మృతదేహాన్ని సమీపంలోని అడవిలో దాచేశారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఆ తర్వాతి రోజు బాధితుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. తాజాగా, పరారీలో ఉన్న నిందితులు ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు.

  • Loading...

More Telugu News