Actor Jagdish: మహిళ ఆత్మహత్య.. ‘పుష్ప’ యాక్టర్ అరెస్ట్

Puspha actor Jagdish Arrested in connection with junior artist suicide
  • ఓ జూనియర్ ఆర్టిస్టు మరో వ్యక్తితో సన్నిహితంగా ఉండగా ఫొటోలు తీసిన జగదీశ్ 
  • ఫొటోలు సోషల్ మీడియాలో పెడతానంటూ బెదిరింపులు
  • వేధింపులు తాళలేక గత నెల 29న బాధితురాలి ఆత్మహత్య
  • పరారీలో ఉన్న నిందితుడిని బుధవారం అరెస్టు చేసిన పంజాగుట్ట పోలీసులు
‘పుష్ప’లో హీరో అల్లు అర్జున్ పక్కన సహాయ నటుడి పాత్రలో కనిపించిన నటుడు జగదీశ్‌‌ను (కేశవ) పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ఓ జూనియర్ ఆర్టిస్ట్ మరో వ్యక్తితో ఉండగా ఫొటోలు తీసి బెదిరింపులకు పాల్పడిన అభియోగంపై అతడిని పంజాగుట్ట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

పంజాగుట్ట పరిధిలో నివాసం ఉంటున్న మహిళ.. జగదీశ్ వేధింపుల నేపథ్యంలో గత నెల 29న ఆత్మహత్య చేసుకుంది. గత నెల 27న బాధిత మహిళ ఓ వ్యక్తితో సన్నిహితంగా ఉన్న సమయంలో జగదీశ్ ఫొటోలు తీశాడు. ఆపై ఫొటోలను సోషల్ మీడియాలో పెడతానంటూ బెదిరింపులకు దిగడంతో తీవ్ర ఆవేదనకు లోనైన బాధితురాలు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. 

ఈ కేసులో తప్పించుకు తిరుగుతున్న జగదీశ్‌ను నేడు పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అయితే, మృతురాలితో జగదీశ్‌కు గతంలో పరిచయం ఉండేదని పోలీసులు తెలిపారు.
Actor Jagdish
Pushpa
Tollywood
Hyderabad Police

More Telugu News