Mahesh Babu: కేరళలో 'గుంటూరు కారం'

Gunturu Karam Movie Update
  • త్రివిక్రమ్ నుంచి 'గుంటూరు కారం'
  • మహేశ్ జోడీగా శ్రీలీల - మీనాక్షి 
  • కేరళలో పాట చిత్రీకరణ 
  • జనవరి 12న సినిమా రిలీజ్

మహేశ్ బాబు అభిమానులందరి దృష్టి ఇప్పుడు 'గుంటూరు కారం' పైనే ఉంది. చాలా గ్యాప్ తరువాత త్రివిక్రమ్ - మహేశ్ బాబు కలిసి చేస్తున్న సినిమా కావడంతో .. చాలా కాలం తరువాత మహేశ్ బాబు చేస్తున్న మాస్ రోల్ కావడంతో అభిమానుల్లో సహజంగానే ఆసక్తి పెరుగుతూ పోతోంది. 

మహేశ్ బాబు లుక్ .. ఆయన స్టైల్ ను త్రివిక్రమ్ కొత్తగా డిజైన్ చేశాడు. ఫస్టులుక్ తోనే మహేశ్ బాబుకి మంచి మార్కులు పడిపోయాయి. టైటిల్ కి తగినట్టుగానే యాక్షన్ సీన్స్ ఒక రేంజ్ లో ఉంటాయని అంటున్నారు. ఈ సినిమాలో మహేశ్ బాబు సరసన శ్రీలీల .. మీనాక్షి చౌదరి అందాల సందడి చేయనున్నారు.

ఒక పాటను చిత్రీకరించడం కోసం ఈ సినిమా టీమ్ కేరళ వెళ్లినట్టుగా చెబుతున్నారు. మహేశ్ బాబు - శ్రీలీలపై బ్యూటిఫుల్ లొకేషన్స్ లో ఈ పాటను చిత్రీకరించనున్నారని అంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ 120 కోట్లకు అమ్ముడుపోయినట్టుగా టాక్. సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. 
Mahesh Babu
Trivikram Srinivas
Sreeleela
Gunturu Karam

More Telugu News