Revanth Reddy: ట్విస్ట్... ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నాక అధిష్ఠానం పిలుపు.. వెనక్కి వెళ్లిన రేవంత్ రెడ్డి

Revanth Reddy return to Maharashtra sadhan from airport
  • పార్టీ అగ్రనేతలతో భేటీ అనంతరం హైదరాబాద్‌కు వచ్చేందుకు ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న రేవంత్
  • అధిష్ఠానం పిలుపుతో విమానాశ్రయం నుంచి మహారాష్ట్ర సదన్‌కు చేరుకున్న రేవంత్ రెడ్డి
  • తెలంగాణ పార్టీ ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రేతో సమావేశం
టీపీసీసీ అధ్యక్షుడు, కాబోయే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్‌కు వచ్చేందుకు ఢిల్లీ విమానాశ్రయం వరకు వచ్చి మళ్లీ వెనక్కి వెళ్లారు. ఆయన విమానాశ్రయం నుంచి మహారాష్ట్ర సదన్‌కు వెళ్లారు. అధిష్ఠానం పిలుపు మేరకు ఆయన నిన్న ఢిల్లీకి వెళ్లారు. నిన్న సాయంత్రం ముఖ్యమంత్రి ప్రకటన అనంతరం రేవంత్ రెడ్డి పలువురు నేతలను కలుస్తున్నారు. నిన్న రాత్రి డీకే శివకుమార్, కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకగాంధీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గేను కలిశారు. పలువురు నేతలు మిఠాయి తినిపించి.. రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. వరుస భేటీల అనంతరం మధ్యాహ్నం హైదరాబాద్ పయనమయ్యారు. అయితే విమానాశ్రయానికి వచ్చాక, వెనక్కు రావాల్సిందిగా ఆయనకు హైకమాండ్ నుంచి పిలుపు వచ్చింది. దీంతో విమానాశ్రయం నుంచి మహారాష్ట్ర సదన్‌కు వెళ్లారు. ఇక్కడ పార్టీ తెలంగాణ ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రేతో భేటీ అయ్యారు.
Revanth Reddy
Telangana Assembly Results
Congress

More Telugu News