Khushi Kapoor: తల్లి శ్రీదేవి ఐకానిక్ స్ట్రాప్‌లెస్ గౌను ధరించి నివాళులు అర్పించిన ఖుషీకపూర్

Bollywood Actress Khushi Kapoor wears her mother Sridevi glamorous gown
  • ‘ద అర్చీస్’ మూవీతో బాలీవుడ్ అరంగేట్రం చేస్తున్న ఖుషీకపూర్
  • తల్లి శ్రీదేవి ఐకానిక్ గౌనులో మెరిసిన నటి
  • రేపు విడుదల కానున్న ‘ద అర్చీస్’
‘ద అర్చీస్’ మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న దివంగత నటి శ్రీదేవి కుమార్తె ఖుషీకపూర్ తల్లిని గుర్తు చేసింది. శ్రీదేవి ఐకానిక్ గౌను ధరించి తళుక్కున మెరిసింది. ముంబైలోని నీతాముకేశ్ అంబానీ కల్చరల్ సెంటర్ (ఎన్ఎంఏసీసీ)లో జరిగిన ఈ సినిమా ప్రీమియర్ షోలో ఖుషి తన తల్లి శ్రీదేవికి నివాళి అర్పించింది. ఈ స్ట్రాప్‌లెస్ గౌనులో ఖుషీ మరింత అందంగా మురిసింది.

2013లో ఐఐఎఫ్ఏ రెడ్ కార్పెట్‌పై శ్రీదేవి ఇదే గౌనుతో నడిచి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇప్పుడిదే గౌను ధరించిన ఖుషీ తల్లికి ఫ్యాషన్ నివాళి అర్పించింది. అంతేకాదు, తల్లి ఆభరణాలను కూడా ధరించింది. రేపు విడుదల కానున్న ‘ది అర్చీస్’లో బెట్టీ కూపర్‌గా ఖుషీ కనిపించనుంది. జోయా అక్తర్ దర్శకత్వం వహించిన ఈ మూవీ సుహానాఖాన్, అగస్త్య నందాల తొలి చిత్రం. వేదాంగ్ రైనా, మిహిర్ అహుజా, డాట్, యువరజా్ మెండా తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.
Khushi Kapoor
Sri Devi
Bollywood
The Archies
Sridevi Iconic Gown

More Telugu News