Devara: 'దేవర' కోసం భారీ సెట్ .. ఈ ఫైటింగ్ ఇంటర్వెల్ బ్యాంగ్?

  • షూటింగు దశలో ఉన్న 'దేవర'
  • యాక్షన్ సీక్వెన్స్ కోసం ప్రత్యేకమైన సెట్
  • ఎన్టీఆర్ సరసన మెరవనున్న జాన్వీ కపూర్ 
  • ఏప్రిల్ 5వ తేదీన సినిమా విడుదల 
Devara Movie Update

కొరటాల - ఎన్టీఆర్ కాంబినేషన్లో 'దేవర' సినిమా రూపొందుతోంది. ఎన్టీఆర్ ఆర్ట్స్ - యువ సుధా ఆర్ట్స్ బ్యానర్లో ఈ సినిమా నిర్మితమవుతోంది. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాకి అనిరుధ్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. ఈ సినిమాతోనే జాన్వీ కపూర్ టాలీవుడ్ కి పరిచయమవుతోంది.

ప్రస్తుతం ఈ సినిమా .. షూటింగు దశలో ఉంది. తదుపరి షెడ్యూల్ ను హైదరాబాదులోని రామోజీ ఫిల్మ్ సిటీలో ప్లాన్ చేసినట్టు సమాచారం. అక్కడ ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ ను చిత్రీకరించనున్నారని అంటున్నారు. అందుకోసం ప్రత్యేకంగా ఒక సెట్ వేయించినట్టు చెబుతున్నారు.

ఈ సెట్లో చిత్రీకరించే యాక్షన్ సీన్ .. ఇంటర్వెల్ బ్యాంగ్ గా వస్తుందని అంటున్నారు. సైఫ్ అలీఖాన్ ప్రతినాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాలో, ప్రకాశ్ రాజ్ .. శ్రీకాంత్ .. మురళీశర్మ ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 5వ తేదీన ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయనున్నారు. 

More Telugu News