Revanth Reddy: ముఖ్యమంత్రి అభ్యర్థి: సర్వేలో 73 శాతం మంది రేవంత్ రెడ్డి వైపు మొగ్గు

Survey reveals in favour revanth reddy for cm post
  • ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై డిజిటల్ మీడియా 'వే2న్యూస్' సర్వే
  • సర్వేలో ఆరు లక్షలమంది నెటిజన్లు
  • 73 శాతం రేవంత్ రెడ్డికి, 16 శాతం మల్లు భట్టి విక్రమార్కకు అనుకూలంగా ఓట్లు

ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి వైపు అధికమంది మొగ్గు చూపుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం ముఖ్యమంత్రి అభ్యర్థి అంశంపై ఢిల్లీలో జోరుగా చర్చలు జరుపుతోంది. దాదాపు రేవంత్ రెడ్డి పేరు ఖరారైనట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రిగా ఎవరు ఉండాలి? అనే అంశంపై డిజిటల్ మీడియా సంస్థ వే2న్యూస్ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో ఆరు లక్షలమంది పాల్గొన్నారు. ఇందులో మెజార్టీ సభ్యులు రేవంత్ రెడ్డి పేరును సూచించారు. డిజిటల్ మార్గంలో జరిగిన ఈ సర్వేలో 73 శాతం మంది రేవంత్ రెడ్డి, 16 శాతం మంది మల్లు భట్టి విక్రమార్కకు అనుకూలంగా ఓటు వేశారు. ఐదు శాతం మంది కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మూడు శాతం మంది ఉత్తమ్ కుమార్ రెడ్డి పేరు వైపు మొగ్గు చూపారు.

  • Loading...

More Telugu News