DK Shivakumar: అంతవరకే నా బాధ్యత: తెలంగాణ ముఖ్యమంత్రి అంశంపై డీకే శివకుమార్ వ్యాఖ్య

DK Shivakumar comments on Telangana chief minister post
  • ఖర్గే ముఖ్యమంత్రి అధ్యక్షుడిని నిర్ణయిస్తారన్న డీకే శివకుమార్
  • సీఎల్పీ అభిప్రాయాన్ని ఢిల్లీ పెద్దలకు నివేదించడానికి ఢిల్లీకి వచ్చానని వెల్లడి
  • సీఎం ఎవరు అనేది ఈ రోజు నిర్ణయిస్తామన్న మల్లికార్జున ఖర్గే

తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నిర్ణయం మేరకు ముఖ్యమంత్రి ఎవరు? అనేది ఉంటుందని కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ అన్నారు. ఆయన మంగళవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ... నిన్న పార్టీ ఎమ్మెల్యేల నుంచి అభిప్రాయాలు తీసుకున్నామని, సీఎల్పీ అభిప్రాయాన్ని ఢిల్లీ పెద్దలకు అందించడానికి వచ్చానని చెప్పారు. సీఎల్పీ అభిప్రాయాన్ని నివేదించడం వరకే తన బాధ్యత అని స్పష్టం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి తదితర అంశాలపై పార్టీ అధ్యక్షుడు ఖర్గే నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు. 

ఇవాళ నిర్ణయిస్తాం... ఖర్గే

తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరు అనేది ఈ రోజు నిర్ణయిస్తామని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. ఖర్గే చాంబర్‌లో ఇండియా కూటమి సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి ముందు ఖర్గే మాట్లాడారు. ఈ రోజు సీఎం అభ్యర్థిని నిర్ణయిస్తామన్నారు.

  • Loading...

More Telugu News