Road Accident: పల్నాడు జిల్లాలో ఢీకొన్న బస్సులు.. 15 మందికి తీవ్ర గాయాలు

Road accident in Palnadu dist 15 injured
  • వినుకొండ నుంచి విజయవాడ వెళ్తున్న ఆర్టీసీ బస్సు
  • బెంగళూరు వెళ్తున్న ప్రైవేటు బస్సు ఢీ
  • ప్రైవేటు బస్సు డ్రైవర్ అతివేగమే కారణమని ప్రాథమిక నిర్ధారణ
  • పరారీలో ప్రైవేటు బస్సు డ్రైవర్

పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం పెట్లూరివారంపాలెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 15 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. వినుకొండ నుంచి విజయవాడకు ప్రయాణికులతో బయలుదేరిన ఆర్టీసీ బస్సు.. బెంగళూరు వెళ్తున్న ప్రైవేటు బస్సు పెట్లూరిపాలెం వద్ద అదుపుతప్పి ఢీకొన్నాయి.

గాయపడిన ప్రయాణికులను సమీపంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రైవేటు ట్రావెల్స్ బస్సు డ్రైవర్ అతి వేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రమాదం జరిగిన వెంటనే అతడు పరారయ్యాడు. ప్రమాదానికి గురైన బస్సులను తొలగించిన పోలీసులు ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.

  • Loading...

More Telugu News