BRS: గుండెపోటుతో బీఆర్ఎస్ జనగామ జిల్లా అధ్యక్షుడు సంపత్ రెడ్డి కన్నుమూత

BRS Jangaon district president dead due to heart attack
  • సాయంత్రం ఐదున్నర గంటలకు ఛాతిలో నొప్పి రావడంతో ఆసుపత్రిలో చేరిక
  • రోహిణి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసిన సంపత్ రెడ్డి
  • సంపత్ రెడ్డి మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన నేతలు
జనగామ బీఆర్ఎస్ జెడ్పీ చైర్ పర్సన్, బీఆర్ఎస్ జనగామ జిల్లా అధ్యక్షుడు పాగాల సంపత్ రెడ్డి గుండెపోటుతో మరణించారు. హన్మకొండలోని రోహిణి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. సంపత్ రెడ్డి ఈ సాయంత్రం హన్మకొండలోని చైతన్యపురిలోని తన ఇంట్లో ఉండగా సాయంత్రం గం.5.30 ఛాతిలో నొప్పి వస్తోందని వ్యక్తిగత సిబ్బందికి చెప్పారు. దీంతో ఆయనను ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశారు. జనగామ నుంచి బీఆర్ఎస్ తరఫున పోటీ చేసి గెలిచిన పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలుపు కోసం ఆయన ఎంతో కృషి చేసినట్లు పార్టీ నాయకులు గుర్తు చేసుకున్నారు. సంపత్ రెడ్డి మృతితో కుటుంబ సభ్యులు, పార్టీలో విషాదఛాయలు నెలకొన్నాయి. ఆయన మృతి పట్ల నాయకులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
BRS
Telangana Assembly Results
Jangaon District

More Telugu News