JC Prabhakar Reddy: జేసీ ప్రభాకర్ రెడ్డి భారీ ర్యాలీని అడ్డుకున్న పోలీసులు

Police stopped JC Prabhakar Reddy rally in Tadipatri
  • టిడ్కో ఇళ్ల లబ్ధిదారులకు న్యాయం చేయాలని జేసీ డిమాండ్
  • నా ఇల్లు - నా సొంతం పేరుతో భారీ ర్యాలీ
  • లబ్ధిదారులను ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తోందని జేసీ మండిపాటు
తాడిపత్రిలో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తాడిపత్రి మున్సిపాలిటీ పరిధిలోని టిడ్కో లబ్ధిదారులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ టీడీపీ నేత, మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి భారీ ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు. 'నా ఇల్లు - నా సొంతం' పేరుతో ఈ ర్యాలీని చేపట్టారు. టిడ్కో ఇళ్ల వద్దకు ర్యాలీగా వెళ్తున్న వీరిని మహాత్మాగాంధీ కూడలిలో పోలీసులు అడ్డుకున్నారు. 

లబ్ధిదారులకు న్యాయం జరగాలనే ఉద్దేశంతోనే ర్యాలీని చేపట్టామని, టిడ్కో ఇళ్ల వద్దకు వెళ్లి తీరుతానని జేసీ పట్టుబట్టారు. ఈ సందర్భంగా టీడీపీ శ్రేణులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ సందర్భంగా జేసీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ... టీడీపీ హయాంలో ప్రారంభమైన టిడ్కో ఇళ్లను పూర్తి చేయకుండా, ఇళ్లు రద్దైన లబ్ధిదారులకు తిరిగి డబ్బులు చెల్లించకుండా జగన్ ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోందని మండిపడ్డారు. 

JC Prabhakar Reddy
Telugudesam
Rally

More Telugu News