Congress: సీఎల్పీ సమావేశంలో ట్విస్ట్.. హైకమాండ్ కోర్టులోకి బంతి

Congress high command to select Telangana CM candidate
  • సీఎల్పీ నేత ఎంపిక బాధ్యతను అధిష్ఠానానికి అప్పగిస్తూ రేవంత్ తీర్మానం
  • తీర్మానాన్ని బలపరిచిన తుమ్మల, భట్టి తదితరులు
  • తీర్మానాన్ని హైకమాండ్ కు పంపిన ఏఐసీసీ పరిశీలకులు

సీఎం అభ్యర్థిని ఎంపిక చేసేందుకు గాను ఏర్పాటు చేసిన సీఎల్పీ సమావేశం ముగిసింది. ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎంపిక చేసే బాధ్యతను హైకమాండ్ కే అప్పగిస్తూ సమావేశంలో ఏక వాక్య తీర్మానం చేశారు. ఈ తీర్మానాన్ని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రవేశ పెట్టగా... తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, మల్లు భట్టి విక్రమార్క, కొండా సురేఖ, ప్రేమ్ సాగర్, శ్రీధర్ బాబు తదితరులు తీర్మానాన్ని బలపరిచారు. ఈ తీర్మానాన్ని ఏఐసీసీ పరిశీలకులైన కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, పార్టీ రాష్ట్ర చీఫ్ మాణిక్ రావ్ ఠాక్రే తదితరులు హైకమాండ్ కు పంపారు. సీఎల్పీ నేత ఎంపికను పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గేకు అప్పజెప్పారు. ఈ నేపథ్యంలో, సీఎం అభ్యర్థికి సంబంధించి మరో రెండు గంటల్లో ఏఐసీసీ నుంచి ప్రకటన వెలువడనుంది.

  • Loading...

More Telugu News