200 కోట్ల కేసీఆర్ డబ్బును ఓడించింది నేను కాదు..ప్రజలు: సీతక్క

Seethakka talks about her victory in mulugu
షార్ట్స్‌లో చూడండి
ములుగు నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి సీతక్క ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ అభ్యర్థి బడే నాగజ్యోతిపై 33,700 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. గెలుపు అనంతరం సీతక్క ఎక్స్ వేదికగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ విజయం ప్రజలదని వ్యాఖ్యానించారు. 200 కోట్ల కేసీఆర్ డబ్బును ఓడించింది తాను కాదని, ప్రజలని పేర్కొన్నారు. ఎన్నికల తరువాత ములుగు నుంచి సీతక్క మేడారానికి వెళ్లి సారలమ్మను దర్శించుకున్నారు. ఈ క్రమంలో అడుగడుగునా ఆమెకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. కాగా, ఈ ఎన్నికల్లో సీతక్కకు 1,02,267 ఓట్లు పోలవగా బీఆర్ఎస్ నేత బడే నాగజ్యోతికి 68,567 ఓట్లు వచ్చాయి.
Go Back to Shorts
Mulugu
Seethakka
Congress
BRS

More Telugu News