Revanth Reddy: గవర్నర్ తమిళిసైని కలిసిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, డీకే శివకుమార్

Revanth Reddy meets Governor Tamilisai
  • ప్రభుత్వ ఏర్పాటుకు తమను ఆహ్వానించాలని కోరిన కాంగ్రెస్ బృందం
  • రేపు శాసన సభాపక్షం అనంతరం సీఎల్పీ నేత పేరును నివేదిస్తామని వెల్లడి
  • రేపు సాయంత్రం ప్రమాణ స్వీకార కార్యక్రమం... అధికారుల ఏర్పాట్లు 
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను కాంగ్రెస్ నేతల బృందం కలిసింది. ప్రభుత్వ ఏర్పాటుకు తమను ఆహ్వానించాలని వారు కోరారు. రేపు శాసన సభాపక్ష సమావేశం అనంతరం సీఎల్పీ నేత పేరును నివేదిస్తామని చెప్పారు. గవర్నర్‌ను కలిసిన వారిలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు ఆ పార్టీ ముఖ్య నేతలు డీకే శివకుమార్, మాణిక్ రావు ఠాక్రే, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్లు రవి తదితరులు ఉన్నారు. సోమవారం సాయంత్రం ప్రమాణ స్వీకారోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది. 
Revanth Reddy
Congress
Telangana Assembly Results

More Telugu News