BJP: కరీంనగర్ లో బీజేపీ, బండి సంజయ్ రీ కౌంటింగ్ కోసం ఆలోచన

BJP to ask for recouning in Karimnagar
  • బండి సంజయ్‌పై 3,163 ఓట్ల మెజార్టీతో గెలిచిన గంగుల కమలాకర్
  • లెక్కింపు సమయంలో మొరాయించిన రెండు ఈవీఎంలు
  • ఈ రెండు ఈవీఎంలలో 1,300 వరకు ఓట్లు

కరీంనగర్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్... బీజేపీ అభ్యర్థి బండి సంజయ్‌పై 3,163 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అయితే ఈవీఎంలను లెక్కించే సమయంలో రెండు ఈవీఎంలు మొరాయించాయి. ఈ రెండు ఈవీఎంలలో 1,300 ఓట్లు ఉన్నాయి. దీంతో కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో రీకౌంటింగ్ జరపాలని కోరాలని బీజేపీ నిర్ణయించింది. కరీంనగర్‌లో బీఆర్ఎస్ అభ్యర్థిగా గంగుల కమలాకర్ రెడ్డి, బీజేపీ అభ్యర్థిగా బండి సంజయ్ పోటీ చేశారు. కాగా, తెలంగాణలో కాంగ్రెస్ 64, బీఆర్ఎస్ 39, బీజేపీ 8, మజ్లిస్ 7 సీట్లలో గెలిచింది.

  • Loading...

More Telugu News