anasuya bharadwaj: కేటీఆర్ ట్వీట్‌పై స్పందించిన యాంకర్ అనసూయ భరద్వాజ్

You have been a true leader Sir anasuya to ktr
  • మీరు నిజమైన నాయకుడు సర్.. ఎందరికో స్పూర్తినిస్తున్నారని కితాబు
  • బలమైన ప్రతిపక్ష నేతగా మీరు చేయాల్సింది చేస్తారని ఆశిస్తున్నానని వ్యాఖ్య
  • హైదరాబాద్‌ను అద్భుతంగా తీర్చిదిద్దారని వ్యాఖ్య

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు పరాభవం ఎదురైంది. 64 సీట్లతో కాంగ్రెస్ పార్టీ గెలుపొందగా, బీఆర్ఎస్ 39 సీట్లతో సరిపెట్టుకుంది. ఈ క్రమంలో కేటీఆర్ తమకు రెండుసార్లు అవకాశమిచ్చిన ప్రజలకు ధన్యవాదాలు చెబుతూ, కాంగ్రెస్ పార్టీకి శుభాకాంక్షలు చెప్పారు. కేటీఆర్ చేసిన ఈ ట్వీట్‌పై బుల్లితెర యాంకర్ అనుసూయ స్పందించారు.

'మీరు నిజమైన నాయకుడు సర్... ఎందరికో స్ఫూర్తినిస్తున్నారు. మన రాష్ట్ర స్థితిని అవతలి వైపు నుంచి చూడాల్సిన అవసరం ఉండవచ్చు. బలమైన ప్రతిపక్షంగా మీరు కూడా చేయాల్సింది ఉంటుంది. ప్రతిపక్ష నేతగా మీరు చేయాల్సింది చేస్తారని ఆశిస్తున్నాను. హైదరాబాద్‌ను అద్భుతంగా తీర్చిదిద్ది ఈ నగరంతో ప్రేమలో పడేలా చేసినందుకు ధన్యవాదాలు' అని ట్వీట్ చేశారు.

  • Loading...

More Telugu News