BRS: గజ్వేల్‌లో కేసీఆర్ విజయం

BRS chief wins in Gajwel constituency
  • సమీప అభ్యర్థి ఈటల రాజేందర్‌పై గెలుపు
  • గజ్వేల్‌లో హ్యాట్రిక్ సాధించిన గులాబీ బాస్
  • 2018తో పోల్చితే తగ్గిన మెజారిటీ

బీఆర్ఎస్ అధినేత, సీఎం హోదాలో గజ్వేల్‌ నియోజకవర్గ బరిలో నిలిచిన కేసీఆర్ విజయం సాధించారు. బీజేపీ తరపున పోటీ చేసిన ఈటల రాజేందర్‌పై ఆయన గెలిచారు. గజ్వేల్ స్థానంలో కేసీఆర్‌కు ఇది హ్యాట్రిక్ విజయం కావడం గమనార్హం. అయితే 2018 ఎన్నికలతో పోల్చితే ఈసారి కేసీఆర్ మెజారిటీ తగ్గింది. తనకు అన్యాయం జరిగింది కాబట్టి గజ్వేల్‌లో కేసీఆర్‌పై పోటీ చేస్తున్నానని ఈటల రాజేందర్ చెప్పడం, విస్తృతంగా ప్రచారం నిర్వహించడంతో గెలుపు ఎవరిదనే ఉత్కంఠ కొనసాగింది. అయితే కేసీఆర్‌కే ప్రజలు పట్టం కట్టారు.

ఇదిలావుండగా కామారెడ్డిలో కేసీఆర్ అనూహ్యంగా ఓటమి పాలయ్యాడు. బీజేపీ తరపున పోటీ చేసిన కాటిపల్లి వెంకట రమణారెడ్డి 5,156 ఓట్ల తేడాతో గెలిచి సంచలనం సృష్టించారు. ఇదే స్థానం నుంచి పోటీ చేసిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, కేసీఆర్‌లపై వెంకట రమణారెడ్డి గెలవడం సంచలనంగా మారింది. కేసీఆర్ రెండవ స్థానంలో, రేవంత్ రెడ్డి మూడో స్థానంలో నిలిచారు.

  • Loading...

More Telugu News