Errabelli: పాలకుర్తిలో సంచలనం... ఎర్రబెల్లి దయాకరరావును ఓడించిన 26 ఏళ్ల యశస్విని రెడ్డి

Errabelli defeated by yashaswini reddy
  • ఆరు సార్లు గెలిచిన ఎర్రబెల్లిపై 26 ఏళ్ల యశస్విని రెడ్డి గెలుపు
  • 14వేల పైచిలుకు ఓట్లతో విజయం సాధించిన యశస్విని
  • వరంగల్ తూర్పు నుంచి కొండా సురేఖ గెలుపు

మంత్రి, బీఆర్ఎస్ పాలకుర్తి అభ్యర్థి ఎర్రబెల్లి దయాకరరావు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి యశస్విని రెడ్డి చేతిలో ఓడిపోయారు. మంత్రిపై యశస్విని 14వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న, పలుమార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఎర్రబెల్లి... 26 ఏళ్ల యశస్విని చేతిలో ఓడిపోయారంటూ సోషల్ మీడియాలో కాంగ్రెస్ కార్యకర్తలు ఎద్దేవా చేస్తున్నారు. మరోవైపు, ఆయన సోదరుడు ఎర్రబెల్లి ప్రదీప్ రావు వరంగల్‌ తూర్పు నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఇక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన కొండా సురేఖ చేతిలో ప్రదీప్ రావు ఓడిపోయారు. కాగా, ఎల్లారెడ్డి నియోజకవర్గం నుంచి ఎర్రబెల్లి దయాకరరావు అల్లుడు మదన్ మోహన్ రావు విజయం సాధించారు.

  • Loading...

More Telugu News