Congress: తెలంగాణలో రేపు కాంగ్రెస్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం

Telangana Congress chief minister will take oath tomorrow
  • తెలంగాణ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్
  • తెలంగాణ అసెంబ్లీలో మొత్తం స్థానాలు 119
  • ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన స్థానాలు 60
  • 64 సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్
  • ఈ రాత్రికి సీఎల్పీ సమావేశం
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీనే విజయం సాధించింది. హస్తం పార్టీ 64 సీట్లలో జయకేతనం ఎగురవేసింది. తెలంగాణ అసెంబ్లీలో 119 స్థానాలు ఉండగా, ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 60 స్థానాలు. ఈ మార్కు కంటే కాంగ్రెస్ మరో 4 సీట్లు ఎక్కువే గెలిచింది. 

ఈ నేపథ్యంలో, రేపు తెలంగాణలో కాంగ్రెస్ సీఎం ప్రమాణస్వీకారం చేయనున్నారు. హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. సీఎం అభ్యర్థి ఎవరన్నది నిర్ణయించేందుకు గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హైదరాబాద్ లోని తాజ్ కృష్ణ హోటల్ కు చేరుకుంటున్నారు. 

ఈ రాత్రికి కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. ఏఐసీసీ పరిశీలకులు కాంగ్రెస్ ఎమ్మెల్యేల అభిప్రాయాలు సేకరించనున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రేపు ఉదయం గవర్నర్ ను కలిసే అవకాశం ఉంది.
Congress
Chief Minister
Oath
Telangana Assembly Election

More Telugu News