kasireddy narayana reddy: రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలి: కల్వకుర్తి నుంచి గెలిచిన కసిరెడ్డి వ్యాఖ్య

Kasireddy Narayana Reddy on chief minister post
  • గెలిపించిన నియోజకవర్గం ప్రజలకు కసిరెడ్డి ధన్యవాదాలు
  • ప్రజా సమస్యలు పరిష్కరిస్తానని, హామీలు నెరవేరుస్తానని హామీ
  • కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావడం ఆనందంగా ఉందన్న కసిరెడ్డి

పార్టీ గెలుపు కోసం కష్టపడిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నానని కాంగ్రెస్ పార్టీ నేత, కల్వకుర్తి నుంచి విజయం సాధించిన కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. విజయం సాధించిన అనంతరం ఆయన మాట్లాడుతూ... తన గెలుపు కోసం నాయకత్వం కృషి చేసిందన్నారు. తనను భారీ మెజార్టీతో గెలిపించిన నియోజకవర్గం ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ప్రజా సమస్యలను తాను పరిష్కరిస్తానని, ఇచ్చిన హామీలను నెరవేరుస్తానన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కానుండడం పట్ల ఆనందంగా ఉందన్నారు. కల్వకుర్తి ప్రజలకు తాను ఎప్పుడూ అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ప్రభుత్వ సాయంతో నియోజకవర్గం అభివృద్ధి కోసం కృషి చేస్తానన్నారు.

  • Loading...

More Telugu News