Congress: కాంగ్రెస్ ఖాతాలో మరో సీటు.. రెండో ఫలితం వెల్లడి

Congress Candidate from Illandu koram Kanakaiah won
  • ఇల్లందులో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు
  • 38 వేల భారీ మెజారిటీతో కోరం కనకయ్య విజయం
  • బీఆర్ఎస్ అభ్యర్థి హరిప్రియకు రెండో స్థానం
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ లో రెండో ఫలితం వచ్చేసింది. ఇది కూడా కాంగ్రెస్ ఖాతాలోనే పడింది. ఇల్లందు నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచిన కోరం కనకయ్య భారీ మెజారిటీతో గెలుపొందారు. బీఆర్ఎస్ అభ్యర్థి హరిప్రియపై ఏకంగా 38 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీ సాధించారు. దీంతో కాంగ్రెస్ పార్టీ ఖాతాలో రెండో విజయం నమోదైంది. ఇప్పటికే అశ్వారావుపేట నుంచి కాంగ్రెస్ అభ్యర్థి ఆదినారాయణ గెలుపొందారు. తెలంగాణలో కాంగ్రెస్ దూసుకుపోతోంది. మ్యాజిక్ ఫిగర్ (60) కన్నా ఎక్కువ సీట్లలో కాంగ్రెస్ అభ్యర్థులు లీడ్ లో కొనసాగుతున్నారు.

తెలంగాణలో స్పష్టమైన మెజారిటీ దిశగా కాంగ్రెస్‌ దూసుకుపోతోంది. 67 స్థానాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. ఈసారి బీఆర్ఎస్ రెండో స్థానానికి పరిమితమయ్యేలా కనిపిస్తోంది. గతంతో పోలిస్తే బీజేపీ కాస్త మెరుగైన స్థితిలో ఉండే ట్రెండ్ కనిపిస్తోంది. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ 37 చోట్ల, బీజేపీ 10 చోట్ల లీడ్ కొనసాగిస్తోంది. ఎంఐఎం 4 చోట్ల ఆధిక్యంలో ఉంది.

Congress
second seat
Illandu
koram kanakaiah

More Telugu News