Malla Reddy: మేడ్చల్ లో మంత్రి మల్లారెడ్డి జోరు

Minister Mallareddy Has A Lead Of 10133 In Medchal
  • నాలుగు రౌండ్ల తర్వాత 10 వేలకు పైగా లీడ్
  • 38,127 ఓట్లతో ముందంజలో మల్లారెడ్డి
  • కాంగ్రెస్ అభ్యర్థికి 27,994 ఓట్లు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మంత్రి మల్లారెడ్డి జోరు కొనసాగిస్తున్నారు. నాలుగు రౌండ్లు ముగిసే సరికి 10 వేలకు పైగా మెజారిటీతో దూసుకెళుతున్నారు. మేడ్చల్ నియోజకవర్గం నుంచి బరిలో ఉన్న మంత్రి మల్లారెడ్డి ఇప్పటి వరకు 38,127 ఓట్లు సాధించారు. ఆయన ప్రత్యర్థులలో కాంగ్రెస్ అభ్యర్థి తోటకూర వజ్రేశ్ యాదవ్ కు 27,994 ఓట్లు పోలయ్యాయి. ఇక బీజేపీ తరఫున పోటీలో నిలిచిన ఏనుగు సుదర్శన్ రెడ్డికి కేవలం 7,519 ఓట్లతో మూడో స్థానంలో ఉన్నారు.

మేడ్చల్ నియోజకవర్గంలో తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులే తనను గెలిపిస్తాయని మల్లారెడ్డి ధీమా వ్యక్తం చేయగా.. రాష్ట్ర ప్రభుత్వంపై వ్యతిరేకత, కాంగ్రెస్ లో చేరికలతో తమ బలం పెరిగిందని తోటకూర వజ్రేశ్ యాదవ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఫలితాల ట్రెండ్ చూస్తే మరోమారు మల్లారెడ్డి గెలుపొందే సూచనలు కనిపిస్తున్నాయి.
Malla Reddy
BRS
Minister malla Reddy
Leading
Medchal

More Telugu News