Bigg Boss: బ్యాడ్ కామెంట్స్ తో డిప్రెషన్ లోకి వెళ్లిపోయాను: 'బిగ్ బాస్' అమర్ దీప్ వైఫ్ తేజస్విని

Tejaswini Amardeep Interview
  • బిగ్ బాస్ హౌస్ లో ఉన్న అమర్ దీప్ 
  • ఆరంభంలో వచ్చిన కామెంట్స్ పై స్పందించిన వైఫ్
  • అంతలా టార్గెట్ చేస్తారనుకోలేదని వ్యాఖ్య 
  • డిప్రెషన్ లోకి వెళ్లానని వెల్లడి

'బిగ్ బాస్' హౌస్ లో అమర్ దీప్ ఆటతీరు కాస్త దూకుడుగానే ఉంటుందనే టాక్ బయట వినిపిస్తూ ఉంటుంది. ప్రస్తుతం ఆయన హౌస్ లోని పోటీదారులతో కలిసి ముందుకు వెళుతున్నాడు. ఈ నేపథ్యంలో ఆయన వైఫ్ తేజస్విని, తాజాగా 'మన మీడియా' వారి ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. 

'బిగ్ బాస్' హౌస్ లోకి అమర్ దీప్ వెళ్లిన మొదటి ఐదు వారాల్లో ఆయనపై నెగెటివిటి ఎక్కువగా ఉన్నప్పుడు, అతణ్ణి సపోర్టు చేస్తూ ఆమె ఎలాంటి పోస్టులు పెట్టలేదనే కామెంట్స్ పై తేజస్విని స్పందించారు. "అమర్ దీప్ ను నేను మొదటి నుంచి సపోర్ట్ చేస్తూనే వచ్చాను. కొన్ని కామెంట్స్ చాలా బ్యాడ్ గా ఉండేవి .. చూడటానికి కూడా నాకు అదోలా అనిపించేది. అలాంటివాటిని డిలీట్ చేసుకుంటూ వెళ్లేదానిని" అన్నారు. 

"అలాంటి బ్యాడ్ కామెంట్స్ చూసి ..  అంతగా టార్గెట్ చేయడం చూసి నాకు పిచ్చిలేచేది. వాటి వలన నేను డిప్రెషన్ లోకి వెళితే, ఇకపై ఆ కామెంట్స్ చూడొద్దని నా ఫ్రెండ్స్ చెప్పారు. ఇక అప్పటి నుంచి నేను ఆ కామెంట్స్ బాక్స్ వైపు వెళ్లలేదు.  అంతకుముందు నేను ఎప్పుడూ అలాంటివి ఫేస్ చేయలేదు. ఏ ఇంటర్వ్యూ లో మాట్లాడితే .. ఏమౌతుందోనని నేను ఇంతవరకూ ఇంటర్వ్యూలు కూడా ఇవ్వలేదు" అని అన్నారు. 

  • Loading...

More Telugu News