Revanth Reddy: బీఆర్ఎస్ పార్టీపై చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కు ఫిర్యాదు చేశాం: రేవంత్ రెడ్డి

Revanth Reddy and Congress leaders complains against BRS Party
  • సీఈఓ వికాస్ రాజ్ ను కలిసిన తెలంగాణ కాంగ్రెస్ నేతలు
  • బీఆర్ఎస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఫిర్యాదు
  • రైతు బంధు పేరిట రూ.6 వేల కోట్ల నిధులు విడుదల చేస్తున్నారని ఆరోపణ
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నేడు తెలంగాణ కాంగ్రెస్ నేతల బృందం రాష్ట్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ వికాస్ రాజ్ ను కలిసింది. బీఆర్ఎస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని ఆరోపిస్తూ, సీఈఓ వికాస్ రాజ్ కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది. దీనిపై సోషల్ మీడియాలో రేవంత్ రెడ్డి పోస్టు పెట్టారు. రైతుబంధు పేరిట రూ.6 వేల కోట్ల మేర నిధుల విడుదలకు బీఆర్ఎస్ సన్నాహాలు చేస్తోందని, తమకు ఇష్టమైన కాంట్రాక్టర్లకు లబ్ది చేకూర్చేందుకు ప్రయత్నిస్తోందని రేవంత్ రెడ్డి తెలిపారు. ధరణి పోర్టల్ ను కూడా తమ స్వార్థానికి ఉపయోగించుకుంటున్నారని, ఆస్తుల యాజమాన్య హక్కులను కేసీఆర్ కుటుంబ సభ్యుల పేరిట బదలాయిస్తున్నారని ఆరోపించారు.
Revanth Reddy
Congress
BRS
CEO Vikas Raj
Telangana

More Telugu News