Mynampally Hanumanth Rao: మల్కాజిగిరి కాంగ్రెస్ అభ్యర్థి మైనంపల్లిపై అట్రాసిటీ కేసు నమోదు

SC ST Atrocities act against congress leader Mynampally Hanumanth Rao
  • యాప్రాల్‌లో పోలింగ్ ముగిసిన అనంతరం ఘటన
  • బీఆర్ఎస్-కాంగ్రెస్ వర్గీయుల మధ్య ఘర్షణ
  • తనను కులం పేరుతో దూషించారంటూ బీఆర్ఎస్ నాయకుడి ఫిర్యాదు
  • కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
సిట్టింగ్ ఎమ్మెల్యే, మల్కాజిగిరి కాంగ్రెస్ అభ్యర్థి మైనంపల్లి హన్మంతరావుపై అట్రాసిటీ కేసు నమోదైంది. పోలింగ్ ముగిసిన అనంతరం మేడ్చల్ జిల్లా అల్వాల్ మండలంలోని యాప్రాల్‌లో బీఆర్ఎస్, కాంగ్రెస్ వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకుడు, మాజీ కౌన్సెలర్ కరంచందర్‌ను ఎమ్మెల్యే కులం పేరుతో దూషించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 

బాధిత కౌన్సెలర్ కరంచందర్ ఫిర్యాదుతో జవహర్‌నగర్ పోలీసులు ఎమ్మెల్యేపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. మరో వర్గానికి చెందిన వారు కూడా ఫిర్యాదు చేయడంతో ఇంకో ఇద్దరిపైనా కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
Mynampally Hanumanth Rao
Congress
Medchal Malkajgiri District

More Telugu News