Nara Lokesh: నారా లోకేశ్ యువగళం పాదయాత్ర నేటి షెడ్యూల్ ఇదిగో!

Nara Lokesh Yuva Galam Padayatra in Pithapuram
  • 215వ రోజుకు చేరుకున్న లోకేశ్ పాదయాత్ర
  • పిఠాపురం నియోజకవర్గంలోకి ప్రవేశించిన యాత్ర
  • సాయంత్రం ఉప్పాడ జంక్షన్ వద్ద బహిరంగసభ

టీడీపీ యువనేత నారా లోకేశ్ యువగళం పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. నేటితో పాదయాత్ర 215వ రోజుకు చేరుకుంది. ఇప్పటి వరకు ఆయన 2,944 కిలోమీటర్ల పాదయాత్రను పూర్తి చేశారు. లోకేశ్ తో కలిసి నడవడానికి వేలాదిగా టీడీపీ కార్యకర్తలు, అభిమానులు తరలి వస్తున్నారు. జనసైనికులు సైతం తమ సంఘీభావాన్ని ప్రకటిస్తూ... పాదయాత్రకు హాజరవుతున్నారు. ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలో పాదయాత్ర కొనసాగనుంది. ఉదయం 10 గంటలకు పిఠాపురంలోకి పాదయాత్ర ప్రవేశించింది. 

నేటి పాదయాత్ర షెడ్యూల్:

  • 10 గంటలకు పవర జంక్షన్ వద్ద పిఠాపురం నియోజకవర్గంలోకి ప్రవేశం
  • 10.40 గంటలకు చిత్రాడ గ్రామస్తులతో సమావేశం
  • 10.50 గంటలకు చిత్రాడలో న్యాయవాదులతో భేటీ
  • 12 గంటలకు పాదగయ వద్ద భోజన విరామం
  • సాయంత్రం 4 గంటలకు పాదగయ వద్ద పాదయాత్ర కొనసాగింపు
  • సాయంత్రం 4.10 గంటలకు పిఠాపురం కుక్కుటేశ్వరస్వామి ఆలయం వద్ద ప్రైవేట్ టీచర్లతో సమావేశం
  • సాయంత్రం 4.20 గంటలకు బీసీ సామాజికవర్గీయులతో భేటీ
  • సాయంత్రం 4.30 గంటలకు పిఠాపురం అంబేద్కర్ సెంటర్ వద్ద ఎస్సీ సామాజికవర్గీయులతో సమావేశం
  • సాయంత్రం 4.40 గంటలకు పాత బస్టాండు వద్ద టూ వీలర్ మెకానిక్ లు, ముస్లింలతో భేటీ
  • సాయంత్రం 4.45 గంటలకు ఉప్పాడ జంక్షన్ వద్ద బహిరంగసభ
  • సాయంత్రం 7 గంటలకు ఓసీ సంఘంతో భేటీ
  • అనంతరం రాత్రికి యండపల్లి జంక్షన్ వద్ద విడిది కేంద్రంలో బస.

  • Loading...

More Telugu News