Hyderabad District: డిసెంబర్ 3న కౌంటింగ్..హైదరాబాద్‌లో సెక్షన్ 144

Section 144 to be imposed in hyderabad in counting day
  • మూడు కమిషనరేట్ల సీపీల ఆదేశాలు 
  • ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకూ ఆంక్షలు
  • మద్యం అమ్మకాలు, బాణసంచా కాల్చడం, ప్రజలు గుమికూడటంపై నిషేధం
  • నిబంధనలను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని సీపీల హెచ్చరిక

ఆదివారం ఎన్నికల కౌంటింగ్ నిర్వహించనున్న నేపథ్యంలో పోలీసులు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సెక్షన్ 144 విధించారు. మద్యం అమ్మకాలపై కూడా నిషేధం విధించారు. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకూ ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని గ్రేటర్ పరిధిలోని మూడు కమిషనరేట్ల సీపీలు సందీప్ శాండిల్య, స్టీఫెన్ రవీంద్ర, డీఎస్ చౌహాన్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. 

కౌంటింగ్ సెంటర్లు, బహిరంగ ప్రదేశాల్లో ఆంక్షలు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు. ఐదుగురి కంటే ఎక్కవ మంది గుమికూడొద్దని, వీధుల్లో బాణసంచా కాల్చొద్దని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

  • Loading...

More Telugu News