Chandrababu: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు

TDP leader Chandrababu visited Tirumala Srivari
  • భార్య భువనేశ్వరితో కలిసి తిరుమల విచ్చేసిన మాజీ సీఎం
  • రంగనాయకుల మండపంలో వేదాశీర్వచనం పలికిన అర్చకులు
  • ఆహ్వానం పలికిన టీటీడీ అధికారులు
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం దర్శనం చేసుకున్నారు. ఆయన వెంట భార్య నారా భువనేశ్వరి ఉన్నారు. చంద్రబాబు దంపతులకు రంగనాయకుల మండపంలో అర్చకులు వేదాశీర్వచనం పలికారు. అంతకుముందు టీటీడీ అధికారులు చంద్రబాబుకు స్వాగతం పలికారు. దర్శనానికి ఏర్పాట్లు చేశారు. శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. మాజీ మంత్రి అమర్నాథరెడ్డి, పెద్ద సంఖ్యలో స్థానిక నేతలు చంద్రబాబు వెంట ఉన్నారు.
Chandrababu
Telugudesam
Andhra Pradesh
Nara Bhuvaneswari
Tirumala

More Telugu News