Ileana: ఇండియాను విడిచి వెళ్లిపోతున్న ఇలియానా?

Ileana to leave India and settle in USA
  • ఇటీవలే మగబిడ్డకు జన్మనిచ్చిన ఇలియానా
  • తన కొడుకు తండ్రి మిచెల్ ను పరిచయం చేసిన ఇల్లీ
  • అమెరికాలో సెటిల్ కావాలని భావిస్తున్న గోవా బ్యూటీ
ప్రముఖ సినీ నటి ఇలియానా తల్లి అయిన సంగతి తెలిసిందే. మగ బిడ్డకు ఆమె జన్మనిచ్చారు. ఆమె సోషల్ మీడియా ద్వారా తన ప్రెగ్నెన్సీ గురించి ప్రకటించిన వెంటనే  అందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే... ఆమెకు పెళ్లి కాలేదు. మరి బిడ్డకు తండ్రి ఎవరనే సందేహం అందరినీ తొలిచివేసింది. ఈ క్రమంలో కొన్నాళ్ల క్రితం తన కొడుకు తండ్రిని సోషల్ మీడియా ద్వారా ఇలియానా పరిచయం చేశారు. తాను గర్భవతిని అని ప్రకటించడానికి కొన్ని వారాల ముండే మిచెల్ డోలెన్ ని వివాహం చేసుకున్నానని ఆమె తెలిపారు. మరోవైపు ఇలియానా తన జీవితానికి సంబంధించి అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. తన భర్త, కొడుకుతో కలిసి ఇండియాను విడిచి వెళ్లేందుకు ఆమె నిర్ణయించుకున్నట్టు చెపుతున్నారు. ఇలియానా అమెరికాలో సెటిల్ కావాలని నిర్ణయించుకుందని సమాచారం.
Ileana
Tollywood
USA

More Telugu News