Telangana Assembly Election: మధ్యాహ్నం ఒంటిగంట వరకు 36 శాతం పోలింగ్, హైదరాబాద్‌లో 20 శాతమే

Polling 36 percent in allover Telangana till 1 o clock
  • అత్యధికంగా మెదక్ జిల్లాలో 50.80 శాతం పోలింగ్ నమోదు
  • రంగారెడ్డిలో 29 శాతం, మేడ్చల్ మల్కాజిగిరిలో 26 శాతం నమోదు
  • పట్టణాల్లో కంటే గ్రామీణ జిల్లాల్లోనే ఎక్కువగా ఓటింగ్
తెలంగాణలో పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు 36.68 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. అత్యధికంగా మెదక్ జిల్లాలో 50.80 శాతం, అత్యల్పంగా హైదరాబాద్‌లో 20.79 శాతం నమోదయింది. వివిధ జిల్లాల్లో ఓటింగ్ శాతాన్ని పరిశీలిస్తే...

అదిలాబాద్ - 41.88 శాతం, 
భద్రాద్రి కొత్తగూడెం - 39.29 శాతం, 
హన్మకొండ - 35.29 శాతం, 
హైదరాబాద్ - 20.79 శాతం,
జగిత్యాల - 46 .14  శాతం,
జనగామ - 44.31 శాతం,
భూపాలపల్లి - 49.12 శాతం,
గద్వాల - 49.29 శాతం,
కామారెడ్డి - 40.78 శాతం,
కరీంనగర్ - 40.73 శాతం,
ఖమ్మం - 42.93 శాతం,
కుమురం భీమ్ - 42.77 శాతం,
మహబూబాబాద్ - 46.89 శాతం,
మహబూబ్ నగర్- 44.93 శాతం,
మంచిర్యాల - 42.74 శాతం,
మెదక్ - 50.80 శాతం,
మేడ్చల్ మల్కాజిగిరి - 26.70 శాతం,
ములుగు - 45.69 శాతం,
నాగర్ కర్నూలు - 39.58 శాతం,
నల్గొండ - 39.20 శాతం,
నారాయణపేట - 42.60 శాతం,
నిర్మల్ - 41.74 శాతం,
నిజామాబాద్ - 39.66 శాతం,
పెద్దపల్లి - 44.49 శాతం,
రాజన్న సిరిసిల్ల - 39.07 శాతం,
రంగారెడ్డి - 29.79 శాతం,
సంగారెడ్డి - 42.17 శాతం,
సిద్దిపేట - 44.35 శాతం,
సూర్యాపేట - 44.14 శాతం,
వికారాబాద్ - 44.85 శాతం,
వనపర్తి - 40.40 శాతం,
వరంగల్ - 37.25 శాతం,
యాదాద్రి భువనగిరి - 45.07 శాతం ఓటింగ్ నమోదయింది.
Telangana Assembly Election
Hyderabad

More Telugu News