Team India: ఆసీస్ తో నాలుగో టీ20 కోసం రాయ్ పూర్ చేరుకున్న టీమిండియా ఆటగాళ్లు

Team India arrives Raipur for 4th T20 against Australia
  • టీమిండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య 5 మ్యాచ్ ల సిరీస్
  • రేపు రాయ్ పూర్ లో నాలుగో టీ20
  • సిరీస్ లో 2-1తో టీమిండియా ఆధిక్యం 
టీమిండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగో టీ20 మ్యాచ్ కు చత్తీస్ గఢ్ లోని రాయ్ పూర్ నగరం ఆతిథ్యమిస్తోంది. ఈ మ్యాచ్ కోసం టీమిండియా ఆటగాళ్లు రాయ్ పూర్ చేరుకున్నారు. గువాహటి నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరిన ఆటగాళ్లకు రాయ్ పూర్ ఎయిర్ పోర్టులో సాదర స్వాగతం లభించింది. ఎయిర్ పోర్టు నుంచి రోడ్డు మార్గం ద్వారా ఆటగాళ్లు, సహాయక సిబ్బంది తమకు కేటాయించిన హోటల్ కు వెళ్లిపోయారు. 

టీమిండియా, ఆసీస్ జట్ల మధ్య నాలుగో టీ20 మ్యాచ్ రేపు (డిసెంబరు 1) రాయ్ పూర్ లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనుంది. ఇరు జట్ల మధ్య ఐదు మ్యాచ్ ల సిరీస్ లో ఇప్పటివరకు మూడు మ్యాచ్ లు జరగ్గా... తొలి రెండు మ్యాచ్ ల్లో టీమిండియా నెగ్గగా, మూడో టీ20లో ఆస్ట్రేలియా గెలిచింది.
Team India
Raipur
4th T20
Series

More Telugu News