KTR: ప్రజాస్వామ్య పండుగలో భాగస్వామ్యం కండి... తెలంగాణ ప్రజలకు కేటీఆర్ సందేశం

Minister KTR cast vote along with his wife
  • బంజారాహిల్స్‌లోని నందినగర్ జీహెచ్ఎంసీ కమ్యూనిటీ హాలులో ఓటేసిన కేటీఆర్
  • వజ్రాయుధాన్ని ఎట్టి పరిస్థితుల్లో వృథాకానివ్వకండని పిలుపు   
  • ఓటు వేసి తెలంగాణ ప్రగతికి పునాదిగా నిలవాలని సూచించిన కేటీఆర్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ బంజారాహిల్స్‌లోని నందినగర్ జీహెచ్ఎంసీ కమ్యూనిటీ హాలులో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. భార్య శైలిమతో కలిసి ఆయన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రజాస్వామ్య పండుగలో అంతా భాగస్వామ్యం కావాలని ప్రజలకు పిలుపునిచ్చారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ నేపథ్యంలో ఎక్స్ వేదికగా ప్రజలకు సందేశమిచ్చారు.

మీ ఓటు..
పరుగులు పెడుతున్న తెలంగాణ ప్రగతికి పునాదిగా నిలవాలి
మీ ఓటు..
తెలంగాణ ఉజ్వల భవితకు బంగారు బాటలు వేయాలి
మీ ఓటు..
తెలంగాణ రైతుల జీవితాల్లో వెలుగులు కొనసాగించాలి
మీ ఓటు..
వ్యవసాయ విప్లవానికి వెన్నెముకగా నిలవాలి
మీ ఓటు..
మహిళల ముఖంలో చెరగని చిరునవ్వులు నింపాలి
మీ ఓటు..
యువత ఆకాంక్షలను నెరవేర్చే అవకాశాల అక్షయపాత్ర కావాలి
మీ ఓటు..
సబ్బండ వర్ణాల్లో.. సంతోషాన్ని పదిల పరచాలి
మీ ఓటు..
తెలంగాణ ఆత్మగౌరవ పతాకాన్ని సమున్నతంగా, సగర్వంగా ఎగరేయాలి
మీ ఓటు..
తెలంగాణ రాష్ట్ర ముఖచిత్రాన్ని తెలంగాణ ప్రజల బతుకు చిత్రాన్ని మరింత అందంగా తీర్చిదిద్దాలి
మీ చేతిలోని వజ్రాయుధాన్ని ఎట్టి పరిస్థితుల్లో వృథాకానివ్వకండి
అందుకే..
ప్రజాస్వామ్య పండుగలో భాగస్వామ్యం కండి.. అందరూ రండి..!
ప్రతి ఒక్కరూ 'ముచ్చటగా…' ఓటు హక్కును వినియోగించుకొండి..!!
జై తెలంగాణ
జై భారత్
KTR
Telangana Assembly Election

More Telugu News