Vijayakanth: విజయకాంత్ చనిపోయారంటూ వస్తున్న వార్తలపై ఆయన భార్య స్పందన

Captain Vijayakanth wife response on his health
  • చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విజయకాంత్
  • ఆయన చనిపోలేదన్న భార్య ప్రేమలత
  • త్వరలోనే పూర్తిగా కోలుకుని బయటకు వస్తారని వెల్లడి
ప్రముఖ తమిళ సీనియర్ నటుడు, డీఎండీకే అధినేత విజయకాంత్ చనిపోయారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆయన భార్య ప్రేమలత స్పందిస్తూ... కెప్టెన్ విజయ్ బాగున్నారని చెప్పారు. ఆయన చనిపోలేదని... తప్పుడు వార్తలను నమ్మొద్దని కోరారు. వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారని... త్వరలోనే ఆయన పూర్తిగా కోలుకుని బయటకు వస్తారని చెప్పారు. 

ప్రస్తుతం విజయకాంత్ చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనకు పల్మనరీ చికిత్స అందిస్తున్నామని చెప్పారు. విజయకాంత్ త్వరగా కోలుకుంటారని ఆశిస్తున్నామని తెలిపారు. గత 10 రోజులుగా ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఊపిరితిత్తుల సమస్యతో ఆయన బాధపడుతున్నట్టు తెలుస్తోంది.
Vijayakanth
Health
Wife
Kollywood

More Telugu News