kalyan ram: ఓటు హక్కు వినియోగించుకున్న కల్యాణ్ రామ్, సాయిధరమ్ తేజ

Sai Dharam Tej and Sai Dharam Tej voted in Jubilee Hills
  • కల్యాణ్ రామ్‌తో సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి చూపిన ట్రాఫిక్ పోలీసులు, కానిస్టేబుళ్లు
  • నా దేశం కోసం.. నా రాష్ట్రం కోసం నా బాధ్యతను నెరవేర్చానంటూ సాయి ధరమ్ తేజ్ ట్వీట్
  • ఓటు హక్కును వినియోగించుకున్న అసదుద్దీన్ ఓవైసీ
సినీ నటుడు నందమూరి కల్యాణ్ రామ్ జూబ్లీహిల్స్‌లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆయన ఓటు వేసి బయటకు వచ్చే సమయంలో పలువురు ఓటర్లు ఆయనను పలకరించారు. ఆ తర్వాత గేటు వద్ద నుంచి బయటకు వెళ్తున్న సమయంలో పలువురు ట్రాఫిక్ పోలీసులు, కానిస్టేబుల్స్ ఆయనతో సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి చూపించారు.

నటుడు సాయిధరమ్ తేజ్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఆయన ఓటు వేసినట్లుగా ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. నా దేశం కోసం.. నా రాష్ట్రం కోసం నా బాధ్యతను నిర్వర్తించాను... మరి మీరు వోటు వేశారా? అని ట్వీట్ చేశారు. 

మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ తన ఓటు హక్కును ఉపయోగించుకున్నారు. ఓటు వేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ... ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్ర మంచి భవిష్యత్తుకు ఓటు వేయాలని కోరారు.
kalyan ram
Sai Dharam Tej
Telangana Assembly Election

More Telugu News