barrelakka: సెక్యూరిటీతో వచ్చి సొంతూరులో ఓటు వేసిన బర్రెలక్క కర్నె శిరీష

Barrelakka costing her vote in their village
  • పెద్దకొత్తపల్లి మండలం మరికల్ గ్రామంలో ఓటేసిన కర్నె శిరీష
  • హైకోర్టు ఆదేశాలతో సెక్యూరిటీ ఇచ్చిన ఎన్నికల సంఘం
  • ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ శిరీష పిలుపు
కర్నె శిరీష అలియాస్ బర్రెలక్క పెద్దకొత్తపల్లి మండలం మరికల్ గ్రామంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆమె స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. హైకోర్టు ఆదేశాలతో ఆమెకు ఈసీ సెక్యూరిటీ ఇచ్చింది. సెక్యూరిటీతో ఆమె పోలింగ్ కేంద్రం వద్దకు వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ... ప్రతి ఒక్కరూ ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరారు.

కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ తరఫున హరివర్ధన్ రెడ్డి, కాంగ్రెస్ తరఫున జూపల్లి కృష్ణారావు, బీజేపీ తరఫున ఎల్లేని సుధాకర్ రావులు బరిలో నిలిచారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రానికి వరుస కడుతున్నారు. ఓటు హక్కును వినియోగించుకునేందుకు పట్నాల నుంచి పెద్ద ఎత్తున జనాలు పల్లెలకు వెళ్తున్నారు. అలాగే తెలంగాణలో ఓటు హక్కు కలిగి ఉండి ఏపీలో ఉన్న ఓటర్లు వస్తుండటంతో హైదరాబాద్ - విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.
barrelakka
karne shirisha
Telangana Assembly Election

More Telugu News