NRI: అమెరికాలో బంధువులను హత్య చేసిన ఎన్నారై విద్యార్థి

NRI students from india kills his relatives in New jersey
  • న్యూజెర్సీలో ఘటన
  • తాత, అవ్వ, మామను తుపాకీతో కాల్చి చంపిన యువకుడు 
  • ఆన్‌లైన్‌లో నిందితుడు తుపాకీ కొనుగోలు చేశాడన్న పోలీసులు
  • నిందితుడిపై హత్యానేరం కింద కేసు నమోదు

అమెరికాలో ఓ భారతీయ విద్యార్థి తన బంధువులను తుపాకీతో కాల్చి చంపాడు. న్యూజెర్సీలో ఉంటున్న ఓం బ్రహ్మ భట్(23) తన తాత, అవ్వ, మామలను హత్య చేశాడు. దిలీప్ కుమార్ బ్రహ్మభట్ (72), బిందు బ్రహ్మభట్ (72), యశ్‌కుమార్  బ్రహ్మభట్‌లను(38) నిందితుడు పొట్టనపెట్టుకున్నట్టు స్థానిక పోలీసులు తెలిపారు. ముగ్గురిని హత్య చేయడం, ఆయుధాన్ని కలిగి ఉండటం తదితర నేరాలపై కేసు నమోదు చేశారు. నిందితుడు గుజరాత్ నుంచి వచ్చినట్టు పేర్కొన్నారు. అతడు ఆన్‌లైన్‌లో తుపాకీ కొనుగోలు చేశాడని, తాము ఘటనా స్థలానికి చేరుకునే సరికి ఓం బ్రహ్మభట్‌ అక్కడే ఉన్నాడని పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News