Nagarjuna Sagar: అర్ధరాత్రి నాగార్జున సాగర్‌ డ్యామ్ వద్ద తీవ్ర ఉద్రిక్తత.. ఇరువైపుల పోలీసుల మోహరింపు!

Tensions Prevailed At Nagarjuna Sagar Dam As AP Police Ocupaid
  • నీటిని విడుదల చేయకపోవడంతో ఏపీ ఇబ్బందులు ఎదుర్కొంటోందని ఆవేదన
  • అర్ధరాత్రి డ్యామ్‌‌పైకి వందలాదిమంది ఏపీ పోలీసులు
  • అడ్డుకున్న సిబ్బందిపై దాడిచేసి మొబైల్ ఫోన్లు, సీసీ కెమెరాల ధ్వంసం
  • ఇరువైపులా పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్
  • నీటి విడుదలను అడ్డుకున్న తెలంగాణ పోలీసులు
  • కుట్రలో భాగమేనన్న కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి

గత అర్ధరాత్రి దాటిన తర్వాత ఏపీ పోలీసులు చొరబడి నాగార్జునసాగర్ డ్యామ్‌కు ముళ్లకంచె ఏర్పాటు చేయడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ప్రాజెక్టుకు ఉన్న 26 గేట్లలో సగభాగమైన 13వ గేట్ వరకు తమ పరిధిలోకి వస్తుందని చెబుతూ 500 మంది పోలీసులతో కలిసి వచ్చిన ఆ శాఖ ఉన్నతాధికారులు తమను అడ్డుకున్న డ్యామ్ సిబ్బందిపై దాడిచేశారు. వారి మొబైల్ ఫోన్లతోపాటు అక్కడి సీసీటీవీ కెమెరాలను ధ్వంసం చేశారు. అనంతరం 13వ గేట్ వరకు ముళ్లకంచె ఏర్పాటు చేసి డ్యామ్‌ను తమ అధీనంలోకి తీసుకున్నారు.

సమాచారం అందుకున్న మిర్యాలగూడ డీఎస్పీ వెంకటగిరి డ్యామ్‌ వద్దకు చేరుకుని ఏపీ పోలీసులతో మాట్లాడారు. డ్యామ్ నిర్వహణ విషయం నీటిపారుదల అధికారులకు సంబంధించిన విషయమని, ముళ్లకంచెను తీసేయాలని సూచించారు. అయితే, వారు స్పందించకపోవడంతో చేసేది లేక వెనక్కి వెళ్లిపోయారు. రాష్ట్ర విభజన సమయంలో నాగార్జున సాగర్ నిర్వహణను కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించింది.

  • Loading...

More Telugu News