K Kavitha: ఎమ్మెల్సీ కవితపై ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు

Congress complaint against MLC kavitha over Election code violation
  • కవితపై ఫిర్యాదు చేశామన్న పార్టీ ఎన్నికల కమిటీ చైర్మన్ నిరంజన్
  • బీఆర్ఎస్‌కు ఓటు వేయాలని కవిత విజ్ఞప్తి చేసినట్టు ఆరోపణ
  • కవిత ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని స్పష్టీకరణ
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారంటూ ఎలక్షన్ కమిషన్‌కు కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది. పార్టీ రాష్ట్ర ఎన్నికల కమిటీ చైర్మన్ నిరంజన్ ఈ విషయాన్ని వెల్లడించారు. బీఆర్ఎస్‌కు ఓటు వేయాలని కవిత ఓటర్లకు విజ్ఞప్తి చేశారని, ఇది ఎన్నికల కోడ్ అతిక్రమించడమేనని ఈసీకి ఫిర్యాదు చేశామని వెల్లడించారు. 

మరోవైపు, తెలంగాణలో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. అక్కడక్కడా ఈవీఎంల మొరాయింపు మినహా ప్రజలు ఉత్సాహంగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఇప్పటికే తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
K Kavitha
Telangana Assembly Election
Hyderabad
BRS
Congress

More Telugu News