Telangana Assembly Election: ఫోన్లతో పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు..సిబ్బంది అభ్యంతరంతో వెనుదిరుగుతున్న వైనం

Voters carrying phones in polling centers stopped by election officials
  • నిబంధనలపై కొందరిలో అవగాహన లోపం
  • మొబైల్ ఫోన్లతో కేంద్రంలోకి వస్తున్న ఓటర్లను అడ్డుకుంటున్న సిబ్బంది
  • కేంద్రం వద్ద సెల్‌ఫొన్ డిపాజిట్ చేసే వెసులుబాటు కల్పించాలని ఓటర్ల వినతి

తెలంగాణ వ్యాప్తంగా ఓటింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. అయితే, కొందరు ఓటర్లకు నిబంధనలపై అవగాహన లేక మొబైల్ ఫోన్లతో పోలింగ్‌ కేంద్రాలకు వస్తున్నారు. అక్కడి సిబ్బంది అభ్యంతరం వ్యక్తం చేయడంతో వారు వెనుదిరగాల్సి వస్తోంది. ఈ క్రమంలో మళ్లీ క్యూలైన్లో నిలబడి ఓటువేయాల్సి వచ్చిందని కొందరు వాపోయారు. పోలింగ్ కేంద్రంలోకి వెళ్లే ముందే ఫోన్లు డిపాజిట్ చేసే సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు.

  • Loading...

More Telugu News