Revanth Reddy: బిర్లా టెంపుల్‌లో గ్యారెంటీ కార్డుతో రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు

Revanth Reddy puja at Birla temple with Guarenty card
  • గ్యారెంటీ కార్డుతో గాంధీ భవన్ నుంచి బిర్లా టెంపుల్‌కు కాంగ్రెస్ నేతలు
  • ఐదుగురి కంటే ఎక్కువమంది వెళ్తే కోడ్ ఉల్లంఘన అవుతుందని పోలీసుల సూచన
  • పూజలు నిర్వహించిన రేవంత్, ఠాక్రే, అంజన్ కుమార్ యాదవ్, వీహెచ్, మల్లు రవి
కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీల కార్డుతో బిర్లా టెంపుల్‌లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. బుధవారం రేవంత్ రెడ్డి, తెలంగాణ పార్టీ ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రే, అంజన్ కుమార్ యాదవ్, వీహెచ్ తదితరులు కలిసి గాంధీ భవన్ నుంచి బిర్లా టెంపుల్‌కు బయలుదేరారు. ఎక్కువమందితో వెళ్తే కోడ్ ఉల్లంఘన అవుతుందని వారిని పోలీసులు గాంధీ భవన్ వద్ద అడ్డుకున్నారు. దీంతో నలుగురైదుగురు నేతలు మాత్రమే వెళ్లారు. బిర్లా టెంపుల్ వెంకటేశ్వరస్వామి వారి పాదాల ముందు గ్యారెంటీ కార్డును పెట్టి రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నాంపల్లి దర్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
Revanth Reddy
BJP
Congress
Telangana Assembly Election

More Telugu News