Jos Alukkas: ఒక్కడే.. జోస్ అలుక్కాస్‌లో చొరబడి 25 కేజీల వజ్రాభరణాలు ఎత్తుకెళ్లాడు.. వీడియో ఇదిగో!

Jos Alukkas showroom robbed in Coimbatore
  • కోయంబత్తూరులోని గాంధీపురంలో ఘటన
  • షాపునకు వెనకవైపు నుంచి కన్నం వేసి లోపలికి చొరబాటు
  • నాలుగు అంతస్తులు కలయదిరుగుతూ తాపీగా చోరీ
  • ఐదు బృందాలతో గాలిస్తున్న పోలీసులు

తమిళనాడులోని కోయంబత్తూరులో భారీ దొంగతనం జరిగింది. ఇక్కడి గాంధీపురంలో ఉన్నజోస్ అలుక్కాస్ బంగారు దుకాణంలోకి సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత చొరబడిన దుండగుడు తీరిగ్గా దొంగతనం చేశాడు. వినియోగదారుడిలా షాపంతా తిరుగుతూ నచ్చిన ఆభరణాలను వెంట తెచ్చిన సంచిలో వేసుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన మార్గం నుంచే ఎంచక్కా వెళ్లిపోయాడు. ఇదంతా మొత్తం షాపులోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది. 

షోరూం వెనకవైపున డ్రిల్లింగ్ చేసి దొంగ లోపలికి ప్రవేశించాడు. ఆ తర్వాత నాలుగు ఫ్లోర్లలో ఉన్న షోరూమ్‌ను క్షుణ్ణంగా పరిశీలించాడు. నచ్చిన ఖరీదైన వజ్రాభరణాలను వెంట తెచ్చుకున్న బ్యాగులో సర్దుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన మార్గంలోనే వెళ్లిపోయాడు.
 
ఉదయం షో రూమ్ తెరిచిన సిబ్బంది దొంగతనం జరిగినట్టు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాదాపు 25 కిలోల నగలు మాయమైనట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. వేలిముద్రలు, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దొంగతనం చేసింది ఒకడేనని గుర్తించారు. గతంలో షోరూములో పనిచేసిన వ్యక్తి కానీ, లేదంటే షోరూము గురించి పూర్తిగా తెలిసిన వ్యక్తిగానీ ఈ చోరీకి పాల్పడి ఉంటాడని భావిస్తున్నారు. ఐదు ప్రత్యేక బృందాలతో నిందితుడి కోసం గాలిస్తున్నారు.

  • Loading...

More Telugu News